ఆ నీలి మబ్బుల దారిలో ....
తేది 13-02-2023
శీర్షిక : ప్రజా సంక్షేమం ....
కవిత సంఖ్య : సహస్రాధికం
వర్ష ఋతువులో అల్లన సాగే
ఆ నీలి మబ్బులు అవనిమాతకు
అవనిమాతను నమ్ముకున్న
జీవరాశికి ... ప్రాణవాయువులు ....
గుంభనంగా సాగే నీలి మబ్బులు
అవనికి ముచ్చట చెప్పి ముద్దాడితేనే
మురిపమై ఆనందాలు పంచేది.
మట్టికి మనిషికి ఉన్న సంబంధం
లాంటిది....
కాట కలిసిపోకుండా చూసుకోవాలి
నేల విడిచి సాములా కాకుండా ...
కర్మసాక్షిగా కర్తవ్యం నిర్వర్తించాలి ...
కలుషితం కాకుండా కాపాడుకోవాలి ....
గ్రీష్మంలో భీష్మించిన వాతావరణానికి
ఎక్కడో పుట్టి ... ఎక్కడో తిరుగుతూ
ఇక్కడికి చేరుకుంటాయి ... సంచార
జాతుల బందు బలగంలా ....
తాత్కాలికంగా నివాసమైనా సరే ...
ఆనందంతో మురిసిపోగానే ...
నందనమై విచ్చుకుంటుంది పచ్చలు
పొదిగిన పుచ్చపువ్వులా అవని మాత.....
ప్రకృతి మాత ప్రసాదించే వరం
ప్రజలందరి సంక్షేమమే లక్ష్యం ....
డేగల్లాంటి పెద్దోళ్ల దిష్టి తగలకుండా
రక్షించుకోవడం మనందరి కర్తవ్యం ....
No comments:
Post a Comment