కవన రవళి
చిత్ర గజల్
తేది : 14-01-2023
5/5/5/5
మదిగదిన దోబూచు
భావనలు ఎన్నెన్నొ ...
గజిబిజిల గడబిడల
ధారణలు ఎన్నెన్నొ ...
అందియల సుందరం
అతివలకు బందురం
అయిననూ కదలనీ
కవనములు ఎన్నెన్నొ ...
ఎరుపంచు కోకతో
మురిపించె నాతినీ
యతులతో ప్రాసతో
పద్యములు ఎన్నెన్నొ...
శిఖిపించి పచ్చలూ
లిఖియించె శాయిలూ
రాగంకు అందనీ
ఎదసొదలు ఎన్నెన్నొ ...
మనసుంచి మదిస్తే
చిలకొచ్చు కవితలూ
రాజసం ఒలికేటి
రాగములు ఎన్నెన్నొ
నగునూరి రాజన్న
No comments:
Post a Comment