కవన రవళి
చిత్రానికి గజల్
తేది : 04-02-2023
మిశ్రగతి 34 34 34 34
మొదటి సారిగ చూసినానులె
ప్రియా నీవే ప్రేమదేవత
మనసు దోచిన మహా రాణిగా
చూసు కుంటా ప్రేమ దేవత
ఎన్ని జన్మల బంధమోకద
ఎరుగనైతీ నా ప్రియసఖీ
వలచి వచ్చిన భామామణిని
ఏలుకుంటా ప్రేమదేవత
ఎదను తాకే ప్రేమ ఊసులు
జవ్వనినోట వింటూంటాను
గుండెలలోన గుడిని కట్టించి
పూజిస్తుంటా ప్రేమదేవత
దరహాసాన చిరునవ్వునూ
తొలగనీయక చూసుకుందును
కనులలోనా కాంతులన్నియు
కాచుకుంటా ప్రేమదేవత
కౌగిలిలోన కరిగిపోయే
కాంతామణికి దాసుడిగానె
కాలంమరిచి తోడునీడగా
దాపునుంటా ప్రేమదేవత
నగునూరి రాజన్న
No comments:
Post a Comment