మాకూ ఒక రోజుంటుంది
తేది: 25-01-2023
శీర్షిక : ఓటరు ....
కవిత సంఖ్య : సహస్రాధికం
పైస మందం పరిశ్రమ లేకుండానే
పైస మందం పరిశ్రమ లేకుండానే
అనుపానుల ప్రత్యక్ష సాక్ష్యమెరు గని
అదృశ్య శక్తంటూ ఏదీ లేదని ....
అంతా నేననే...అహం బ్రహ్మాస్మి ...
నేననుకునే .... నేను కాని నేనును
నమ్ముకుని... ఏమి తేకుండా వచ్చి
ఏమి తీసుకుపోలేనని తెలిసినా ....
స్వార్థాల సంచులు నింపుకుంటున్నారు ....
ఉత్తర దక్షిణాల ఊసులతో
బంధు బలగాలను కాచుకున్నట్టు
జన సామాన్యులను పట్టించుకోక
బలగమే బలమని విర్రవీగుతున్నారు ....
మన అనే జనం మాటలు చెవికెక్కించుకోక
నా అనే భావనలే హద్దులు దాటించుకుని
బుద్దుల సుద్దులను దరిచేరనీయకుండా
అహం ముసుగులో నిగ్గదీసుకుని ... విర్రవీగి
వీధులలో పతాకం రెప రెపలాడిస్తున్నారు ....
అవసరానికి కాళ్ళు పట్టుకుని ...
ఆసీనమయ్యాక .... తీరు మార్చుకుని ...
నేనే సేనానినని... నేనే మంత్రినని ...
ఎదురులేని రారాజునని... దర్జాలు
వెలగబెడుతున్నారు .... మాట్లాడితే
కొట్లాడి ... తప్పు లేకున్నా ... తప్పులు
పడుతూ ... తిప్పలు పెడుతున్నారు ...
భూమి గుండ్రమన్న విషయం
తెలియనిది కాదు... శిశిరంలో
తలలు దులుపుకున్న తరువులు
వసంతంలో చిగురించినట్టు ....
చీకటి తదుపరి వెలుగులా .... మాకు
మంచి రోజులొస్తాయని మరిచినట్టున్నారు ...
చెడుగుడు ఆడించే చెడుకు ... ఒకటి
రెండు అవకాశాలు చిక్కినా .... మంచికి
కంచుకోటలా ఎప్పుడూ అవకాశాలే ....
గుర్తించి ... నర్తించితే ... ఆనందం .....
మాకూ ఒక రోజొస్తుంది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment