దేవాలయాల బిల్లు
పార్లమెంటులో ఈనాడు ...
తేది : 19-02-2023
ఓడెక్కేదాకా ఒడామల్లప్ప అంటూ ...
తదుపరి అంతా బోడ మల్లప్పలేలా ....
గుంభనంగా దాచి వివరాలు
గుటుక్కుమనిపించారు చివరి క్షణాన ...
ప్రజాక్షేత్రంలో పరాభవమైనా
బోళాశంకరుణ్ణి మనసు పెట్టి
స్తోత్రించి మంత్రించి బోల్తా కొట్టించి ...
వరాల జల్లులు కురిపించుకున్నారు ....
ఆనక అసలు విశ్వరూపాలు చూపిస్తూ ...
ప్రజల మనోభావాలతో పరాచికాలాడుతూ
అల్లల్లాడిస్తున్న....పెను మూకల
ముక్కున కళ్లెం వేసినట్టవుతున్నది .....
మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు ...
అన్న చందంగా ఉంది ...
స్వాతంత్యానంతర పాలనలు ....
చాప కింద నీరులా మెత్తగా మాట్లాడి
ఒత్తి పారేయడం లో ఆరితేరిన ఆనాటి
కోటరీలు చేసిన అనేక అక్రమార్జన
కార్యక్రమాలలో ఇదీ ఒకటి ....
కపట నాటకాలతో కబ్జా మంత్రం
పాటిస్తూ దర్జాలు వెలగబెట్టే
సన్మార్గులకు ...సలాకల వాతలా
సన్నాయి వాయిద్యం ... ఈ బిల్లు.
ఎవ్వరికి లేని వెసులుబాటు
మనకు మాత్రమే ఇచ్చిన నాటి
కుతంత్రాల కుల పెద్దలైన
మిత్రబృందానికి అశనిపాతమే...
ప్రతిపక్షం ఊసులు లేకుండానే
ఏకపక్షంగా పాలకపక్షం ప్రజలను
వంచిస్తూ వచ్చిన ఆటపాటలకు
కళ్లెం వేయగలిగే రౌతు దొరికాడు ...
మనం చేస్తే సంసారం .... ఎదుటి
వాళ్ళు చేస్తే వ్యభిచారం ముద్రల్లా
చడీ చప్పుడు లేకుండా మొదలెట్టిన
తప్పుడు కార్యక్రమాలకు...
అప్పుడు వాళ్ళు చేసిన తప్పులను
సరిచేస్తుంటే .... తట్టుకోలేక
తప్పని తెలిసినా...పరాయి శత్రువులతో
చేతులు కలిపి ఎవ్వారాలను తమకు
అనుకూలంగా తిప్పుకోవాలని చక్రం
అదేపనిగా తిప్పుతూనే ఉన్నారు ...
దర్బారు దూలాలను ఒక్కొక్కటిగా
విచ్చుకుంటూ రంధ్రాలను సరి చేస్తూ ....
ఇంటిమీది రావి లేదా మర్రి మొక్కలను
చిక్కులు విడదీసుకుంటూ కూకటి వేళ్ళతో
ఒక్కొక్కటిగా పెకలిస్తూ పీకేస్తుంటే ....
తట్టుకోలేక తటపటాయిస్తున్నారు ...
No comments:
Post a Comment