Saturday, February 10, 2024

చిరంతన స్వప్నాలు తేది : 12-10-2022 శీర్షిక : తీరని కలలు

 చిరంతన స్వప్నాలు

తేది : 12-10-2022
శీర్షిక : తీరని కలలు 
కవిత సంఖ్య : సహస్రాధికం 

బుద్ది నేర్చినప్పటినుండి 
నీలం బుర్ర బుట్టలో ఒక్కొక్కటి 
చేరుతూనే ఉన్నాయి...
బలిష్టమైనవి మర్రి మానుల్లా  
కాలానికి నిలబడినాయి .... 
మానుల నీడలలో గరికల్లాంటివి 
దక్కక మాడిపోయాయి .... 

అయినా అన్నింటి బరువు 
ఓపలేక... కొన్ని జ్ఞాపకాల 
దొంతరలో అడుగున పడిపోగా ... 
కొన్ని మాత్రమే నిరంతరం 
వెంటపడుతున్నాయి .... 

వెంటపడ్డ వాటిలో కూడా 
వేటకు దక్కనివి ఎన్నో ఎన్నెన్నో...  
కాలమాన పరిస్థితుల కమామీషులు .... 
కనిపెట్టలేని ముగ్గు బుట్టలోని పిట్ట కథలు....  

పేర్లు మారుతున్నాయి తప్పితే 
పేదోడికి పెద్దరికం దక్కని విధంగా ... 
రెక్కాడితే గాని డొక్కాడని 
బక్కోడి బ్రతుకు ఛాయాచిత్రం లాగ ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment