నువ్వు నూటొక్క కత్తులు
నూరుకుంటేంది ... ?
తేది : 17-01-2023
శీర్షిక : రాత మార్చుకో ....
సంఖ్య : సహస్రాధికం
సవాలక్ష సార్లు విరమణలను
ఉల్లంఘించి సాధించిందేమిటి ....
ఆదరించారనుకున్న వాళ్లంతా
ఆకు చాటు పిందెలా ముఖం
చాటేస్తున్నారు ...
నీ భుజం మీద బరువు మోపి
నిన్ను ప్రత్యక్ష దోషిగా నిలబెట్టినా
తెలుసుకోలేక ... చెప్పుడుమాటలకు
చెవులంగలార్చి చేటుగా...
ఇంక ఎన్నాళ్లకు గుర్తిస్తావు....
కుప్పమీదొచ్చే తెప్పలాటలా
అప్పనంగా అందినంత దోచుకుని
జలసాలను సాగించి .... చేతులు
కాలాక ఆకులు పట్టుకోని
అడుక్కున్నా పాపమనే వారేరి ...
అనువు కానీ చోటుకు వచ్చినా
అమ్మలాంటి భూమాతను
పంచి ఇచ్చిన పాపానికి ....
పదే పదే కాలుదువ్వుతున్నావు
పరాభవాలను రుచి చూస్తున్నావు ....
మొండి వాదనల కొండ మీద
కూర్చుంటావు ...స్వతహాగా తోచదు
చెబితే వినవు ....కాలికి పెడితే
వేలికి .... వేలికి పెడితే కాలికి లంకె...
పొరుగు క్షేమం పొందు లాభమంటే
వినవెందుకు .... ఒంటెత్తు పోకడ...
అసిద్దమంటే ... ఆశ పడతానంటావు ...
ఎక్కడ మొదలెట్టి ఎక్కడివరకు చెప్పాలి ...
శాంతంగా బ్రతుకు సాంత్వన చెందు ...
నువ్వు నోటొక్క కత్తులు నూరుకుంటే
ఏమి జరిగింది ..... ఏమి సాధించావు ...
బ్రతుకనియ్యి .... బ్రతుకును ఇయ్యి ...
తెలుసుకో జీవిత పరమార్థం ....
గీతలో బోధించినట్టు ... రాత మార్చుకో ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment