చిత్ర కవిత
తేది : 20-02-2023
శీర్షిక : గోకర్ణమా ?
వందనాలో వందనాలు
వందనాలో లింగమయ్యా
వందనాలో వందనాలు
జగములేలే జంగమయ్యా...
తెలిసీ తెలియక చేసిన పాపముల
తేట తెల్లముగా కడిగి తేలిక చేసే గంగాపతి
కైమోడ్పుల వందనముల నందుకుని
మమ్ము కరుణించుమో… కైలాసపతీ .....
లింగ రూపమున ఏలుకునే
వెండి కొండల దండి దొరవని
నిండు మనసున మమ్మెపుడూ
కాచి మమ్ము కాపాడమని మొక్కెద ....
అపర జ్ఞాని ఆ రావణబ్రహ్మ
ఆత్మ లింగము తేవాలన్న ఆశలను
విఘ్న నాయకుడు విషమ పరీక్షల
వింతచేష్టల చేజార్చి ప్రతిష్టించిన గోకర్ణమా ....
ఏమని వర్ణించము నీ లీలలు ....
అభిషేకప్రియమని అలలతో
నిండిన సంద్రపు ఒడ్డే నీకు
పసందైన ప్రదేశమని ఎంచితివా ....
No comments:
Post a Comment