కాశీనాథుని విశ్వనాథ్
తేది: 03-02-2023.
కళామతల్లికి ముద్దు బిడ్డడు
సినీ రంగానికే మహారాజు ....
తోడికోడళ్ళుతో అడుగిడినా
ఆత్మగౌరంతో నిలబడినాడు ...
సిరిసిరి మువ్వల రవములతో
జలతారుల్లో సిరి తానై కురిసాడు
నిరక్షరాస్యురాలైన సీతామాలక్ష్మికి
నీరాజనాలను అందించాడు ....
శంకరాభరణంతో జనుల మనములో
శంకలన్నీ తీర్చేసి... కళలకు కాలం
చెల్లిపోలేదని... కణికట్టుగ కథలను
జోడించి కమనీయతలను కూర్చాడు. ...
ఒక్కొక్క చిత్రమును స్వాతిముత్యంలా
ఒడిసిపట్టి తపస్సు చేసిన మహర్షి ....
సిరివెన్నెలతో చల్లదనాలను కురిపించి
సాగరసంగమంతో సరిగమలు పలికించాడు....
అంకితతత్వమే ఆతని పెట్టుబడి
సంస్కృతికి సదా పట్టం కట్టి ...
సంప్రదాయానికి పెద్ద పీట వేసి...
విలువలున్న వలువలనే ధరించాడు.....
సాంఘీక సమస్యలను సైతం సున్నితంగా
ఎప్పటికప్పుడు స్పృశిస్తూ మెప్పించిన ధీశాలి ....
పుష్కలమైన పురస్కారాలతో బాటుగా
సుందరమైన నందులెన్నో పొంది
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పద్మశ్రీతో
సత్కరించబడినాడు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment