యాతం గూడ మోట
పారే జలధారలను పట్టి బంధించి
పంట పొలాలకు పారించడానికై…
పచ్చదనాలను పొదగడానికి
పగడపురాశులు పండించడానికై…
లోతునున్న నీటిని గట్టుపైకి తేవడం ....
మనిషి చేసిన నాటి నీటి మర
రైలు గేట్ లాంటి గెడ కర్రకు మరో కర్ర
నిలువుగ జత చేసి .... కర్రకు తాళ్లతో
కట్టి బంధించగ బొక్కెన తగిలించి...
నిట్ట నిలువు కర్రకు సమాంతరంగా
తాను నిలబడి బొక్కెన నీటిలో ముంచి
పైకెత్తుతూ ....ఎత్తి పోయడమే యాతం .....
కొద్దిపాటి లోతు తేడాతో నీరుంటే ....
కొలను గట్టి నీటినంతటిని పోగేసి…
ఇద్దరేసి మనుషులు ఇరు వైపుల
తాళ్లతో కట్టిన అండాకారపు బొక్కెనతో
నిండుగా నీరెత్తి ... గట్టుపైకి తాళ్లతో
విసరడమే ...గూడ ....
పెద్ద పెద్ద మొత్తాలలో నీటిని లోతు నుండి
ఎత్తి గట్టుమీద కుమ్మరించుటకై ....రెండు
ఎద్దుల సాయంతో ....ముందుకు...వెనకకు
నడుస్తూ.....గిలకపై నుండి దందెడతో
దండిగా బంధించిన నీటి గుమ్మటాన్ని....
తోలు సంచి తొండముగా కట్టి ఎత్తిపోయడమే ....
మోట కొట్టడం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment