నా కలల వాకిలిలోకి నీవు అడుగిడిన వేళ
తేది: 10-01-2023
శీర్షిక : విశ్వాన్నే విజయించినంత ....
సంఖ్య: సహస్రాధికం ...
అనుకోవడమే ఆలస్యంలా
అనుకోని దేవతగ అరుదెంచినదని
అడగకముందే వరాలిచ్చిన
అధి దేవతలా ప్రత్యక్షమైనదని .....
కళ్ళల్లో కమనీయమైన మెరుపులు
కాంతులీనుతుంటే....ఎవరో గిలిగింతలు
పెట్టినట్టు... ఒళ్ళంతా ఒకటే తుళ్ళింతలు...
మననమే మనసుకెంతో హాయి
గొలిపే కులుకులు....ఒక మహాద్భుత ఘట్టం ....
గ్రీష్మంలో భీష్మించిన వేడి సెగలను
వెన్నెల జలతారులు చేసిన గుండు
మల్లెల గుభాళింపులు .....
పక్కన ఎవరో వెదజల్లిన మరువ
ధవనాల పరిమళాలు...
హేమంతంలో గరికవనంపైన
నిలిచిన తుషార బిందువుల్లా ...
ఎదపైనుండి జాలువారుతున్న
ముత్యములబోలు ...తెలియని
అంతః సడి ....
పట్టరాని ఆనందం ... పట్టుకోలేని
ఉత్సాహం...పనులలోన పదనిసలయ్యే
తప్పటడుగులు... పరధ్యాన్నపు
పలకరింపులు ... పరాకుల మనోభావాలు ...
ఒక్కటేమిటి....
విశ్వాన్నే విజయించినంత
సంబరం ....వినీలాకాశంలో
విహంగమై వింతగా నర్తించిన
విపరీతం....తథాస్తు దేవతలు
దీవించిన చందం… బంధం బలీయమనే నమ్మకం…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment