Monday, February 12, 2024

గ్రంథ పఠనం తేది: 20-02-2023 శీర్షిక : విజ్ఞాన వంతం

 గ్రంథ పఠనం 

తేది: 20-02-2023
శీర్షిక : విజ్ఞాన వంతం 

అక్షరాస్యతల అలుపెరగని 
పయనం ...చల్లుకుంటూ పోతే 
కలుపు మొక్కలు లేని కమనీయమైన 
విజ్ఞాన పంటల విస్తీర్ణం పెరుగుతుంది  ....  

మొక్కలన్నీ సారవంతమై... మొగి 
పురుగుల్లాంటి అవినీతిని పారద్రోలి 
పుష్టి కలిగిన పుష్కలమైన మొక్కలతో 
ఆరోగ్య సంఘమై వెలుగులీనుతుంది ... 

అమ్మలా అక్కున చేర్చుకుని 
గుండెల్లో నిబ్బరాన్ని నింపుతుంది .... 
అప్పుడప్పుడు తడిని  తడిమి 
కన్నీరు రప్పించి కరుణ చూపుతుంది ... 

రాతి గుహలలో రంజిల్లిన జీవితం 
రంగు భవనాల్లోకి మారినట్టుగా .... 
సంఘమంతా సమృద్ధి చెందితే ...
బలమైన ఆలోచనల తేజమౌతుంది ...  

ఆనాటి గ్రంథాలయాల ఉద్యమం 
అనితరమై నిలిచింది....స్వాతంత్ర 
పోరాటంలో సమిధలను కూర్చి 
వీరులను చేర్చి  మాతృభూమి సేవలో .... 

సాంకేతికత చంకలో దూరాక.... 
కొంత తగ్గి ... అన్నీ చరవాణి లోనే 
ఇమిడిపోయి ... వింతగా మనిషిని 
తన గుప్పిట బందించుకున్నది .... 

ఇప్పుడేది తెలిసినా తెలియక పోయినా ... 
అన్నీ గూగులమ్మతో గుసగుసలే ....
సోషల్  మీడియాల సొల్లు కబుర్లతో 
కాలమంతా హరించుకు పోతున్నది .... 
 
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment