Saturday, February 10, 2024

అలకలు మొలకెత్తిన వేళ తేది :16-01-2023 శీర్షిక : చెప్పుడు మాటల చేటు ... 1086

 అలకలు మొలకెత్తిన వేళ 

తేది :16-01-2023
శీర్షిక : చెప్పుడు మాటల చేటు ... 
సంఖ్య: సహస్రాధికం 

మందరలు మాట నాటితే 
మనసంతా ఊగిసలాడదా ....  
కాలనాగులాంటి కల్మషములు 
కైకేయిగ  కస్సుమనుగదా .... 

పరితపించిన కన్నతండ్రి మనసు 
ప్రాణములు ఉస్సూరుమనగా...  
కట్టుబడిన రామయ్య కానలకు బైలెల్ల 
కట్టుబట్టలతో సీతమ్మా సౌమిత్రితో 
కాల చరిత్రలో చీకటి పేజీగా .... 

కష్టాలకు చిరునామాగా 
కదిలిపోయిన సీతా రామయ్యలను 
కక్ష్య గట్టిన కాల ప్రభావం 
విడగొట్టి వింత చూసింది ... 

అపర విజ్ఞానియైనా ... చెల్లె 
చెప్పుడు మాటలకు చెడిపోయి.... 
కాలగమనంలో రావణ బ్రహ్మైనా 
కడు నీచములాచరించె కదా .... 

కాలమంతా కాటకలిసిపోయి 
వెదుకులాటలకే జీవితాలైపోయి ... 
పెను ధ్వంస రచనలకు 
పెద్ద తలలెగిరిపోయే .....  

చర్యకు ప్రతిచర్యలా .... 
ఉరిమి ఉరిమి మంగళం మీద 
పడినట్టు ...ఒకరి అలకల మొలక 
మరొకరి  వినాశనానికి దారైంది.... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment