Monday, February 12, 2024

దాంపత్య రేఖ తేది: 16-02-23 శీర్షిక: పాలు నీళ్లు లా

 దాంపత్య రేఖ 

తేది: 16-02-23
శీర్షిక: పాలు నీళ్లు లా 
కవిత సంఖ్య: సహస్రాధికం 

పూర్వ బంధమో ... పుణ్య ఫలమో ... 
చూపులు కలిసిన శుభవేళ అంటూ 
మాటల వంతెనలు దాటుకుని 
బాసల బ్రతుకులకు  తెరతీసి 
అన్యోన్యతల లతలై అల్లుకునేది ..... 

ముద్దు మురిపాలతో మొదలయ్యి 
హద్దుల పొద్దులు తెలియకుండగనే 
సుద్దులు కూడా తెలుపుకోలేనంతగా 
పద్దులు రాసుకున్న పుటలతో ప్రారంభం .... 

ఒకటొకటిగా పేజీలు తిప్పుతుంటే 
ఒద్దికలన్నీ  సద్దిముల్లె కట్టినట్టుగా 
పాలు నీళ్లుగా కలిసి పోయేది .... 
ప్రాణవాయువులై శ్వాసించేది ..... 
ఒకరికొకరై కలిసి సాగేది ..... 

అనుక్షణం అరమరికలు లేకుండా
కనుపాపలు రెండైనా చూపులు ఒకటిగా 
దినములు గడిచినను... ఘనములు 
పెంచుతూ ....ఒకరికొకరు బలమై ... 
బలగమై .... బ్రతుకు సాగించేది .... 
 
అప్పుడప్పుడు అప్పు తచ్చుల్లా 
చిలిపిగా చిటపటలాడుకున్నా  
అంతలోనే అవగాహనలు తలకెత్తుకుని 
వంతలు పాడుకుని అనురాగపు పాటను 
ఆలపించేదే .... దాంపత్య రేఖ .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment