Saturday, February 10, 2024

తప్పని విధిరాత తేది: 04-01-2023 శీర్షిక : జీవుడి వేదన ...

 తప్పని విధిరాత

తేది: 04-01-2023
శీర్షిక : జీవుడి వేదన ... 
కవిత సంఖ్య : 204

దేహమే దేవాలయమని  
జీవుడే దేవుడని ఘోషించె 
ఉపనిషత్తులు పురాణాలు .... 
సంస్కృతి సంప్రదాయాలు .... 

అంకురమే అశనిపాతం 
పుడమిపై పుట్టుకే పోరాటం 
పురిటినుండి పుడకల వరకు 
అడుగడుగున వేదనాభరితం ... 

సలహాలిచ్చేవారే సవాలక్ష మంది 
సాయానికొచ్చేవారు చూస్తే శూన్యం 
అమలు చేయలేని ఉన్నత ఆదర్శాలు 
అవసరానికందని కనీస సంతోషాలు ... 

నియంత్రణ ఎరగని ప్రారంభముతో 
నిలకడలేని పరుగుల పందెంతో   
గమ్యం తెలియని గమనం  సాగుతుంది.... 
బుద్ది నేర్చే వరకు తిరిగి చూసుకుంటే 
పొద్దు నిత్తికెక్కి పుణ్యకాలం గడిచింది...  

విశ్వమంతా వింతగా సప్తవర్ణశోభితమే ... 
అయినా తప్పని తప్పటడుగుల తమాషాలు... 
తమ పర బేధాలు మరిచిన వైనం ... 
స్వార్థాల సుడిగుండాలలో చిక్కుకోవడం .... 

బుద్ది మాటల సుద్దులన్ని బుట్టలో వేసి 
గట్టు మీద పెట్టి ... మంచి చెడుల 
విచక్షణలు గాలికి వదిలేసి... మనసుకు 
తోచింది  మహాభాగ్యమనుకుని 
కళ్ళకద్దుకుంటూ పోయి ...తప్పని 
విధిరాతంటూ .. విరించిని నిందించడం ...  

కర్మఫలమే నంటూ  కరాఖండిగా 
బోధించిన గీత సారాంశాలను... 
పాటించి... తపించడం కన్నా 
జపించడం  మేలని తెలుసుకున్న 
జీవుడే ధన్యజీవి .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment