చిత్ర కవిత
తేది: 13-01-2023
శీర్షిక : తరుణీమణి .....
కవిత సంఖ్య : 206
చిత్తరువెంత విచిత్రమో
చిత్రకారుని మది లోతులా ...
బిక్కుబిక్కుమంటున్న మహిళ
బీరువై భీతిల్లి నిలిచిన తీరు ....
విశ్వమెంత విస్తారేమో ...
విచలిత విచార వదనయై
వీక్షించుచుండె వనిత ...
మోడు వారిన చెట్టు నీడన ....
కలవరపడి కలత చెందిన
కలికి మనము... కలం పట్టి
కదం తొక్కితే కాలంతో పోటీ
పడవచ్చేమోనని సంశయమా ?
తరువును పోలిన తరుణీమణి
పరుల సేవలే పరమార్థంగా
తరాల వారధిగా తనువును
సమర్పించే సమున్నతం .....
అర్ధనారీశ్వరుడై ఆ శివుడు
బోధించినా ... బాధించుడే
పనిగా పెట్టుకున్న నరుడు
యుగాలనుండి ఊరిస్తున్నదే
కాదనకుండా .. లేదనకుండా ...
ఇవ్వకుండా కాలయాపనలు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment