Saturday, February 10, 2024

నవ యువకా ! తేది: 12-01-2023 శీర్షిక : మేలుకో ... దేశమే ప్రథమం 1083

 నవ యువకా ! 

తేది: 12-01-2023
శీర్షిక :  మేలుకో ... దేశమే ప్రథమం 
సంఖ్య : సహస్రాధికం 

నరేంద్రుడే నందుడాయె 
వివేకములు  వికసించగ ... 
జాతికి జవసత్వాలు నింపిన 
జనచింతన యోగి పుంగవుడు ... 

కూపమందు కుళుకులీనే 
కూర్మంలా కుంచించక...  
విహంగమై వీక్షించు 
విశ్వమెంత విస్తారమో ... 

శిశిరంలో తలలు దులుపుకున్నా 
తరువులెంత దృఢతరమో 
తనువంతా పరులకే తపియించి 
తల్లడిల్లు...తనివి దీర తృప్తి చెందు .... 

ఘనరాసుల ధనరాశుల 
గంభీర నిలయం జ్ఞాన సంద్రం .... 
మౌనమై ధ్యానమై మనమే 
చేరాలి స్థిరమై సుస్థిరమై సంసిద్ధమై .... 

అరకొర సౌకర్యాలు అందుకున్నను 
అఖండ భారతమంటే  అదాటున 
అందిపుచ్చుకోవాలి ... అంజలి 
ఘటించి ఆత్మ నివేదన చేయాలి ... 

మంచితనాలతో  పాటుగా  లౌక్యపు 
నేర్పరి తనాలను మూటగట్టుకుని... 
మలకలను సునాయాసంగా విడదీయాలి ... 
మౌనంగానే ఎదగాలి ....  

అది ఇది అను తేడా లేకుండా 
అన్నింటా చేరుకో ...ఆపదలను 
ఎదురుకో ... ఆలంబనై నిలుచుకో ... 
దేశమే ప్రథమం ... మిగతా అధమం ... 
మేలుకో నవయువకా !

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment