యుగళ గీతం
తేది :21-01-23
శీర్షిక : ప్రేమ మననం
కవిత సంఖ్య : సహస్రాధికం
పల్లవి ... ఇద్దరు
క్షణమొక యుగమే
తలవక నిలవడము
దినమొక కల్పమే
మనమున నిలపడము ...
అతడు :
మరుమల్లెల పరిమళాలే
కలహంసల కదలికలు
కుసుమ రాగరంజితమే
ఎద కోయిల కూతలు ...
ఆమె :
ప్రేమ అంకురించగనే
పెదవులపై నర్తించు ..
సరిగమల సరాగమై
సందడుల మనోగీతం
అతడు
మనసులోన మననములే
మధురమైన అనుభూతులు...
తేనియలా గ్రోలుటలో
సుందరమే భావనలు .....
ఆమె :
పెదవులారు తడబడి ....
మాట పెగులు మడతబడి
బిడియంలో గడబిడ
జీవితమే ముడిపడి .....
పల్లవి ఇద్దరు
క్షణమొక యుగమాయె
తలవక నిలవడము
దినమొక కల్పమాయె
మనమున నిలపడము ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment