Saturday, February 10, 2024

చిత్ర కవిత తేది : 31-12-2022 శీర్షిక : నండూరి వారి నగిషీ

 కళాశ్రీ చిత్ర కవిత

తేది : 31-12-2022
శీర్షిక : నండూరి వారి నగిషీ 
కవిత సంఖ్య : 2022

ఆసీనతలో అద్భుతమే 
అరవిరిసిన  గాంభీర్యం... 
సూక్ష్మంలో మోక్షమే 
సూదంటు రాయిలా  చూపుల్లో 
విరిసిన సునామీ కల్లోలం .... 

కొప్పులోన విరిసిన చామంతీ 
గులాబీ... చప్పున గుర్తుకొచ్చే 
నండూరి వారి నగిషీలు .... 
బాపు బొమ్మల భళా చిత్రాలు ... 

సజ్జ చేను గట్టుమీద సన్నజాజి 
తీగలా .. మేఘమాల మెరుపులా... 
నడుముకు కొడవలి తగిలించుకుని 
వగలు పోతున్నది వయ్యారి భామ ... 

చారెడేసి కళ్ళతో చక్కిలిగింతల 
చిరు దర హాసపు వదనంతో 
మృదు మధురపు భావనల
సిరులొలికే బుగ్గల కెంపులతో 
సిగ్గులకే వన్నెలద్దే ముద్దుగాను ....  

అరుణవర్ణం చీరకట్టి  అందంగా  
కాశ పూసి... సింధూరం తీర్చి దిద్ది 
రాణివాసముట్టిపడే యువరాణిలా 
కట్టు బొట్టూతోని  కనికట్టే చేసింది ... 

మదిలోని భావాలను మధురంగా 
పొదువుకుని విసిరిందొక మన్మధబాణం 
విరితాపం జతచేసి...  కొంటెతనం 
కొసరు వేసి... ఈ అంబుజవదన ...  

No comments:

Post a Comment