ఒక సయోధ్య కోసం
తేదీ 01-02-2023
శీర్షిక : సాధు గుణములు పొదువుకుంటే ...
కవిత సంఖ్య : సహస్రాధికం
అహం దుప్పటి కప్పుకున్నవాడికి
స్థాయి మరిచి సాము చేసేవాడికి
నెత్తిమీద మొట్టికాయ పడినప్పటికీ
ఫలితాల అంచనా లెక్కలేని తనమే ...
బూచీలు చూపిస్తూ పేచీలు పెట్టి
కన్ను మిన్ను కాననీయని తనంతో
కథా ... కమామీషులు నడిపిస్తూ....
పరోక్ష సన్నివేశాల పడగలతో ...
మనుషులు.... భావాలు .... ప్రత్యక్ష
చర్యలకు ఉసిగొలిపుతూ....తమాషాలు
తక్కెడలో పోసి లెక్కలు చూస్తుంటాయి ....
గడ్డ మీద కూర్చుని కాకమ్మ
కథలెన్నయినా చెప్పవచ్చు ....
అనుభవిస్తున్న వాడికి మాత్రమే...
కష్టముయొక్క సాంద్రత తెలిసేది ....
నష్టముయొక్క బాధలు బాధపడేది ...
సగటు ప్రజలను బలి పశువులను చేస్తూ...
సంకుచిత స్వార్థాల మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ ....
యుద్దములో కూడా సిద్ధమయ్యే
లాభ నష్టాల బేరీజులు వేసుకునే సన్నాసులు
కొంతమందయితే .....
స్వార్ధము నీడను తాకని తపోధనులై
తమ పర భేదములు చూపని మహాత్ములై
సర్వే జనా సుఖినోభవంతు అని
మనసారా కోరుకునే సాధు గుణములు
పొదువుకుంటే....సయోధ్యల సాధన
ఫలితం మన స్వాతంత్య్ర సమరంలో
సాధించిన విజయంలా గోచరించదా...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment