పక్క చూపులు
తేది : 08-02-2023
శీర్షిక : అమ్మ దయ
కవితాసంఖ్య : సహస్రాధికం
మాతా హంసవాహిని వింధ్యవాసిని
పక్క చూపులో ... కొస చూపులో
కిరణం మెరియగనే భరణమై కురిసింది
మానసంలో కావ్య కన్యకై చిలికింది ....
అక్షరాస్యత తోట ఆసరా అవుతుందని ...
కాసుల వేటలో కాలం కలిసి వస్తుందని ...
విజ్ఞాన వివేకాలు విజయాలు చేకూరుస్తాయని ...
అమ్మా నాన్నలు ఆరాటపడి .. పంపిస్తే ....
కాలమంతా కరగదీసి వడియగట్టి
మణికట్టుకు బలపం కట్టుకుని ఆచార్యులు
గొంతు చించుకుని... తుమ్మెదలా చెవిలో
ఇల్లుకట్టుకున్నట్టు అరిచి గీ పెట్టినా ....
బుర్రను కొక్కానికి తగిలించి ..ఆలోచనల
రాశులను కుమ్మరించుకుని ... చూపులు
గాలాలను ఎక్కడో వేలాడదీసి ....మానస
మూసను వీధిలో వదిలేసిన .... చందంగా ...
పరాకంత... చిరాకులనే మిగల్చగా ...
పట్టుబట్టిన పక్కచూపులు పగబట్టిన
ఫలితమేమో .... పంతం నెగ్గించుకోగా
పరీక్షల కాలాన బిక్కమొఖమేయించినది ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment