సంక్రాంతి గేయం
తేది :14-01-2023
శీర్షిక : తెలుగు నాట ....
సంఖ్య : సహస్రాధికం
వచ్చింది వచ్చింది
సరాగాల సంక్రాంతి ...
తెచ్చింది తెచ్చింది
తెలుగునాట శోభలను ....
హేమంతపు సీమంతం
మంచుతెరల మనోహరం...
తుషారాల గరికవనం
ఉషోదయాల సుందరం ...
భాస్కరుని గమనంలో
ఆయనం మార్చుకుని ...
బహుగొప్పగ అమిరింది
మకరములో సంక్రమణం ... // వచ్చింది //
వేరు వేరు నామముల
వేడుకలే దేశమంతా ...
కమనీయం సంస్కృతి
కళాత్మకం భారతీయం ..
వరసబెట్టి మూడొద్దులు
మురిపాలను తెచ్చింది ...
భోగీ సంక్రమణములు
కనుమ పండుగులై ... //వచ్చింది//
తెల్లవారకముందే
తెచ్చింది శోభలను ...
తెలుగువారి వీధులన్ని
తేరిపారే ముగ్గులతో ....
హరిదాసులు కీర్తనలను
ఆలపించు రమ్యంగా ...
బసవన్నలు నృత్యాలను
బహుసంబరమీయంగా ... //వచ్చింది//
చేతినిండ పంటలతో
చేవకలుగు రైతన్న ...
పంటసిరుల ధాన్యాలతో
హాలికుడు సంతసించ ...
వృత్తులన్నీ వికసించు
చిత్రంగా పల్లెలోన ...
పల్లె ప్రజల ఆనందం
పరికించ తరంకాదు ... //వచ్చింది//
ప్రకృతే పరమాత్మని
పదిలంగా పూజించు ...
పేడతోని గొబ్బెమ్మలు
పెనుసవాళ్ల శాస్త్రీయత ...
శౌర్యాలకు సూచికలు
కుక్కుటముల పందెములు...
జీవితమే రంగులని
బోధించు గాలిపటం //వచ్చింది//
నగునూరి రాజన్న
No comments:
Post a Comment