మహాశివరాత్రి
తేది : 18-02-23
శీర్షిక: శివ శివ శివ యని పలికెను తనువు…
సంఖ్య :
శివ శివ శివ యని పలికెను తనువు…
భవ భవ భవ యని నుడివెను మనసు …
దక్షయజ్ఞమును నీవు దద్దరింపజేసి…
ముద్దుగొలుపు సతిని ముభావమున
స్వీయ దహనమునకు తానె శ్రీకారమవ్వగా…
పార్వతీ జన్మకు పదిలమైతివి స్వామీ….
శివ శివ శివ యని పలికెను తనువు…
భవ భవ భవ యని నుడివెను మనసు …
కుసుమ విల్లునెక్కుపెట్టి
కుమార సంభవ బీజమేసిన..
చెరుకు విలుకాన్ని నీవు చెరపంగ..
చలించి కొంత జ్వలించి మాడ్చి…
మసి చేసినావు…మహాదేవుడా….
శివ శివ శివ యని పలికెను తనువు…
భవ భవ భవ యని నుడివెను మనసు …
మనసుతో నామంబు మననము చేయగనే
మరులు గొలిపిన ప్రేమ మత్తులు వదలక…
ఇత్తువన్ని కోరికలు ఇలవర్ష చేయకనే
అసురులైననేమి అడిగినన్నియును…దేవా
శివ శివ శివ యని పలికెను తనువు…
భవ భవ భవ యని నుడివెను మనసు …
ఆలికి తనువు పంచి అమరత్వం పొంది
అర్దనారీశ్వరుడవయ్యావు… నీవు
ఉత్తుంగ తరంగమైన గంగ నెత్తిన నిలిపి
జీవకోటికి దేవుడవయ్యావు…
శివ శివ శివ యని పలికెను తనువు…
భవ భవ భవ యని నుడివెను మనసు …
వెలుగు వెన్నెలపైన వెండికొండల రేడు
భక్తసులభుడతడు బహుదొడ్డ దేవుడు…
సగరుల శాపములను బాపి
సర్వేశ్వరుడవు ఇయనావు ఇలలో….
భం భం భోలే మహాదేవా…యని.
డం డం భోలే సదాశివా... అంటూ…
శివ శివ శివ యని పలికెను తనువు…
భవ భవ భవ యని నుడివెను మనసు …
నగునూరి రాజన్న
No comments:
Post a Comment