Saturday, February 10, 2024

అప్పుడప్పుడు నేను తేది : 19-01-2023 శీర్షిక : కాలయంత్రంలో సంచారం 1089

 అప్పుడప్పుడు నేను 

తేది : 19-01-2023
శీర్షిక : కాలయంత్రంలో సంచారం
కవిత సంఖ్య: సహస్రాధికం 

వెండి జలతారుల నిండు భాండాగారం 
అపూర్వ నిధి నిక్షేపాలతో ఓలలాడుతూంటే  
సమయ నియమాలను అధిగమించ 
సన్నివేశాలను ఆవిష్కరించుకుంటున్నాను...   

నవ వసంతపు  సంధ్యారాగంలో 
చల్లని మలయమారుత వీవెనలో 
జ్ఞాపకాల పందిరిలో సేదదీరుతుంటే 
పుటలన్నీ దొర్లిపోతూ .... ఒక్కొక్కటి 
పలకరిస్తుంటే .... ఒళ్ళంతా పులకరింతలే .... 

ముందో ...వెనకో ....అందరు చేరే గమ్యమే ... 
అనంతమైన ఆలోచనల కేంద్రాగారం 
పరమ పవిత్రమైన దివ్య సందోహం .... 
ప్రతివారికి అనుభవైక సందర్భం ... 

బాల్యపు పూర్వాశ్రమ మిత్ర బృందంతో 
బాతాఖానీ చేస్తూ అప్పుడప్పుడు నేను 
కాల సమయ సూచీ యంత్రంలో సంచారం 
చేస్తూ ....  తప్పొప్పుల తనిఖీలతో 
ముప్పులేని ఒప్పుల కుప్పగా వెలిగి పోతుంటాను .... 

అలా పుణికిపుచ్చుకున్న అనుభవాల 
దొంతరలలోనే ...ఏరుకుంటే ఎంతో 
చక్కని ఆరోగ్య చిట్కాలుంటాయని 
అనుభవాలన్నీ వల్లె వేస్తున్నాయి .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment