Saturday, February 10, 2024

శ్రీరామ పట్టాభిషేకము - 25-12-22

 శ్రీరామ పట్టాభిషేకము

25-12-22

దశరథ నందనా 
భవభయ భంజనా //2//

కామేష్టి యాగముతో  కౌసల్యకు తనయుడివై
దశరథ మహారాజును విశదముగా బ్రోచితివి .... 
మరువలేని మాతృప్రేమ అన్నదమ్ములనురాగం
శ్లాఘనీయమినవంశము  దేశప్రజల అనుబంధం  … 

//దశరథ నందనా 
భవభయ భంజనా // 

రాజఋషి మాటపైన యాగములను రక్షించగ … 
ధర్మములను నిలబెట్టగ తాటకిని చంపితివి ... 
గురువాజ్ఞ గుంభనమై శివధనుస్సు ఛేదించి...  
వరమాలను పొందితివి సీతమ్మా తల్లిచేత … 

//దశరథ నందనా 
భవభయ భంజనా // 

జేజేలు వెలిబుచ్చుతూ ప్రజలంతా  పలికిరి .... 
భువిపైన మీజంటకు దేవతలు దీవించిరి ... 
కళ్యాణం కమనీయం కనులపంట ప్రజకంతా… 
ఆచరిస్తూ  తప్పకుండా  తరిస్తాము నేటికిని … 

//దశరథ నందనా 
భవభయ భంజనా//

జనకుని మాటపైన జవదాటక కదిలావు… 
వసంతాలు పదునాలుగు వనవాసం సీత సౌమిత్రితోడ … 
తృణప్రాయం అన్నియును బోగభాగ్య లాలసలు 
యుగాలన్ని తేజములే  జగాన నీ చరితములు… 

//దశరథ నందనా 
భవభయ భంజనా//

పంచవటిన నివసించ పరికించెను శూర్పణఖ 
వంచనకు మారుపేరు  కించపరిచె భావాలను .... 
కక్షగట్టి ప్రోత్సహించే కడుమాయల మారీచుని 
కనకపు వర్ణములద్దుకుని కనిపించే మాయలేడిగా .... 

//దశరథ నందనా 
భవభయ భంజనా//

కనివిని ఎరగని మాయా కాంతులతో కనుగప్పె .... 
అంత కాంత సీతమ్మ ఆశపడి అడిగె కదా   .... 
పరుగు పెట్టితీవి నీవు పట్టుకుందు దిట్టమని ... 
మాయావి మాటలకు సాగనంపే మరిదిని .... 

// దశరథ నందనా 
భవభయ భంజనా //

అంతట జంగముగా అరుదెంచె రావణుండు 
విధిరాతల మార్చలేని వింతనాటకం తెరపైన ... 
చెరబట్టగ  సీతమ్మను చెడుకాలం దాపురించి 
చెప్పుడు మాటలపైన  పరసతిని చేటుగా ..... 

// దశరథ నందనా 
భవభయ భంజనా //

చెట్టుపుట్ట  గాలించి ... చలించిన మనస్సుతో 
కుదుటపడే కొంచమంత  జటాయువు మాటలతో ... 
పయనమయ్యి చేరుకునే సుగ్రీవుని  కిష్కింధకు 
పవిత్రమైన స్నేహముకై  వధించెనంత వాలిని .... 

// దశరథ నందనా 
భవభయ భంజనా //

వరములతో  అంజన్న చిరంజీవి అయినాడు 
పరముగా భావించి  బంటుగా చేరినాడు ... 
అంజనమ్మ తనయుడు వాయుపుత్ర వీరుడు ... 
అడుగడుగున సేవించి అనురాగం పొందాడు ... 

// దశరథ నందనా 
భవభయ భంజనా //

వెనుదిరిగి చూడకుండ పెనుసంద్రం లంఘించి 
సీతమ్మ జాడదెచ్చి రామయ్యకు మోదమిచ్చే .. 
సైన్యమంత కూడగట్టి సేతువును బంధించగ 
సింహళం పయనమయ్యే   సింగములై పోరుకు .... 

// దశరథ నందనా 
భవభయ భంజనా //

వింతగానూ తోచినను విభీషణుండు శరణుజొచ్చె 
విధివ్రాతగ వీరులను  మట్టుబెట్టే లక్ష్మణుండు .... 
సౌమిత్రి మూర్చిల్లగా  సంజీవిని పట్టితెచ్చే 
అంజన్న వేగిరంగా ఆత్మీయత  నింపుకుని .... 

// దశరథ నందనా 
భవభయ భంజనా //

సూచించెను విభీషణుండు సూక్ష్మంలో మోక్షమును 
యుద్దములో రావణుణ్ణి  సిద్ధముగా చంపంగా...
నెయ్యముతో లంకను విభీషణుకు పట్టమిచ్చి  
కదిలె నంత రామయ్య కరమందించి సీతమ్మకు .... 

// దశరథ నందనా 
భవభయ భంజనా //

పట్టాభిషేకమున పట్టరాని సంతోషములే 
రామరాజ్య స్థాపనల రంజిల్లగ  అయోధ్య ... 
యుగాలెన్ని గడచినను ఉదాహరింప యోగ్యమై 
పాలనెంత  మారినను పవిత్రమై బోధించగ  ..... 

// దశరథ నందనా 
భవభయ భంజనా //

No comments:

Post a Comment