Monday, February 12, 2024

చిత్రకవిత తేది: 06-02-2023 శీర్షిక : మన్మథ సమ్మోహనం .... 1100

 చిత్రకవిత 

తేది: 06-02-2023
శీర్షిక : మన్మథ సమ్మోహనం .... 
కవిత సంఖ్య : సహస్రాధికం . 

నల్లనయ్య వేళ్ళన్నీ ధీమాగా నాట్యమాడగ  
నవరసాలను పలికించే సప్తస్వరాలను 
సంధించగ హస్తములలో బందీ అయి 
సుషుప్త చేతనావస్థలను చేధించే వేణువు .... 

అల్లంత దూరం నుండి రాగం 
వినపడగానే ఒళ్ళంతా తుళ్లింతలే ... 
మనసు పరవశాలే ... మననమంతా 
మమతల తీగలే ....కన్నయ్య కమనీయమే ... 

రేపల్లెలో చెట్టు చేమ పుట్ట గుట్ట అన్నింటా 
సుపరిచితమైన సురుచిర సరాగమే ... 
మదిని తట్టి పరవశాలను కుమ్మరించే 
మన్మథ సమ్మోహన  సమానమే .... 

మూగమనసులను సైతం ముగ్దమై 
రంజింపజేసే ముచ్చటైన వేణువు.... 
ఆధ్యాత్మికతలను సైతం అలవోకగా 
ఆస్వాదింపజేసే అసలైన ఆయుధం ... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment