Saturday, February 10, 2024

కవన రవళి తేది 08-01-2022 తిస్రగతి గజల్

 కవన రవళి  

తేది 08-01-2022   
తిస్రగతి గజల్ 
6/6/6/6

వయ్యారీ భామలాగ 
మెరిసిపోయె చందమామ 
వపా గారి పాపలాగ 
మురిసిపోయె చందమామ !

వనకన్యక తళుకులతో 
వయారంగ సుతారమై 
జలకన్యక సొగసులతో 
నిండిపోయె చందమామ 

కోట లోన రాణి తాను 
కోరి నిలిచె బీద ప్రేమ 
మాట లేని మూగ ప్రేమ 
వలచిపోయె చందమామ !

యుక్త వయసు వచ్చిననూ  
నోరు విప్పి చెప్పలేక 
మూగ నోము వరము లాగ 
మరిచిపోయె చందమామ !

రాజుపేద రాగములో 
రాలిపోయె జంటలాగ 
కోటలోని మహారాణి 
నిలిచిపోయె చందమామ !

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment