చిత్ర కవిత
తేది :23-01-23
శీర్షిక : ప్రకృతి కానుక
కవిత సంఖ్య : సహస్రాధికం
ప్రకృతెంత రమణీయమో
పరితపించి పరిచయించ
ప్రతీది సుమ మనోహరమే
పరిమళించు పరివ్యాప్తియై ....
మరకతమై శోభించే పచ్చిక
బయలు ... కొండా ... కోనలు ....
గలగలల హొయలు పోయే
వాగు ... వంకలన్నీ... గమ్మతులే....
హేమంతపు తుషారమైనా
ఉషోదయాల సీమంతమై
పూల కొమ్మలై పూసినట్టు
వెలుగుల రెమ్మలై విరిసినట్టు ...
నిశిలో ఆయుష్షు పోసుకుని
అల్పమైనా స్వల్పమైనా
రవి కాంతికి తుర్రుమనే
కవి కాంతుల మనోహరం ....
ముత్యాలై భ్రమింపజేస్తూ
మురిపాలను పంచే హిమ
సోయగములు... ప్రకృతి
ఒడిలో విరిసిన పరమ విశిష్టమైన
కానుక ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment