Saturday, February 10, 2024

కనుమ పండుగ తేది : 16-01-2023 శీర్షిక: కృతజ్ఞతా భావం .. 1084

 కనుమ పండుగ 

తేది : 16-01-2023
శీర్షిక:  కృతజ్ఞతా భావం .. 
కవిత సంఖ్య : 

సనాతనమైనా..  సంప్రదాయమైనా... 
ఆచారమైనా ... వ్యవహారమైనా ....  
అంతా సశాస్త్రీయమే  హైందవాన... 
బ్రతుకు ... బ్రతుకనీయు .... 
 
మడి ఆచారం మైలలు 
శుచి శుభ్రతల మెళకువలు
జప తపాల యోగ రీతులు  
పాప పుణ్యాల ప్రతిఫలాలు 
ఆధ్యాత్మికతల అవపోశనలు .... 
అన్నీ ఆరోగ్యవంతమైన 
మానవాళి  మనుగడలకే...... 

విశ్వ కాల గమన రీతులో .....   
ఆనవాయితీ ఆయనాల మార్పులో .... 
శీతోష్ణస్థితుల మాయ ఉత్సులో  .... 
సూక్ష్మ క్రిముల ఉరుముల మెరుపులో .... 
నియతి  కాల నియంత్రణలే 
నిత్య జీవిత సత్యాలుగా గుర్తింపు ...... 

ప్రకృతి సంపదల ప్రతిఫలాలయిన 
మనిషి...  పశువు...  పరిసరాలు ...... 
కావేవీ మినహాయింపు .... అన్నీ అర్హమే..... 
ఆరోగ్యాల నిర్వహణలకు .... 
పూర్వీకుల అనుభవాల జోడింపులే 
పుణ్యకాల పర్వదినముల నిర్ణయాలు. 

ఆది మానవ దశల నుండి 
అన్నీ తానై నిలిచిన పశువులను  
అలంకరించి ఆనందించే 
అమృత ఘడియలే  "కనుమ పండుగ" మనకు .... 

ఏరువాకతో మొదలయ్యి 
ఎడతెగని సేవలందించి
చేను చెలకలన్నింటిని తెర్లించి
ధాన్య రాశులను ధారబోసిన 
పశువుల బాగోగులే కనుమ పండుగ .... 

పశువులకు స్నానాలు 
పెట్టి పుట్టు అలంకారం  
అనారోగ్య నివారణకు 
అనువైన మందులు ... 

కొమ్ములకు కుప్పెలు 
మెడలోన  గజ్జెలు 
ఇంద్రధనస్సు వర్ణాలు 
ఇగురించే అందాలు ..... 

పక్షులకు వరిగొలుసులు  
కువ కువల గమ్మత్తులు 
అందరికి అన్నిచ్చి 
తెలుపుకునే కృతజ్ఞతలే 
కనుమ పండగ   .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment