చిత్ర కవిత
తేది : 06-01-23
శీర్షిక : కుసుమ పొత్తిలి
సంఖ్య : 205
నిర్మలమైన ప్రకృతి ఒడిలో ....
నిశ్చింతగ టుంగుటుయ్యాల పై
జో జో పాప జో జో లాలి
నిదుర పో కన్నయ్యా ...!
చీకూ చింత లేని చిన్నారి నీవు
అన్నీ మరిచి ఆదమరిచి నిదుర పో
యశోదమ్మ ముద్దుల తనయా ...
యదునందన చిన్ని కృష్ణా ... !
నీరెండ కిరణాలు నిను తాకి మురువంగ
తరువుల పవనాలు తుళ్ళింతలవగా
తన్మయత్వం చెంది తనివితీరా
నిదురపోవయ్యా బలరామ సోదరా ... !
ఏడేడు లోకాలు ఏలవలసి ఉంది ...
మున్ముందు మురిపించి పాలించవయ్యా ...
నిదురపో కన్నయ్య నిదురపో నా తండ్రి
నీలాల కన్నులు నిర్మలింపంగ .... !
మతి భ్రమించే లతల తోరణాలు
ఒత్తిగిలి పడుకున్న కుసుమ పొత్తిలి
హాయి గొలిపెనేమో అచ్చెరువుగా ...
అయినా సరితూగదేమో అమ్మ ఒడికి ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment