సుభాష్ చంద్ర బోసు
23-01-23
శీర్షిక : శత్రువుల గుండెల్లో ఫిరంగి
కవిత సంఖ్య : 208
ఉన్నత ఉద్యోగాన్ని తృణప్రాయంగా
వదులుకుని ... స్వార్థమెరుగని
స్వరాజ్య పోరాటంలో అడుగిడిన
అచంచల మాతృ దేశభక్తుడు ....
మితవాదపు ఆలోచనావిధానాలు
మింగుడుపడక పదవులను త్యజించి
అతివాదపు ముద్ర వేసుకున్న
అనితర సాధకుడు అకుంఠిత దేశ భక్తుడు....
ఆకాశమే హద్దంటూ నిద్ర పోకుండా
అహరహరం శ్రమించి విశ్వమంతా
తిరిగి ఎందరినో కట్టుకుని...ఏకంగా
సైన్యాన్ని నడిపించిన ధీరో దాత్తుడు ....
రవి అస్తమించని ఘన సామ్రాజ్యమని
విర్రవీగిన తెల్లోని గుండెల్లో నిద్రపోయి
కంటిమీద కునుకు లేకుండా చేసిన
భారతీయ కొదమసింహం .....
సింహంలా గర్జించి .... రక్తాన్ని
ధారపోయండని యువతను కోరి ....
స్వతంత్ర్యాన్ని సాధిస్తానన్న.. .
ఆత్మాభిమానం కలిగిన ధైర్యశాలి .....
జననం తెలిసి .... మరణం ఎరుగని
మహానుభావుడు .... చివరకు
నా అనుకున్న వాళ్ళ ఆలోచనలకు
బలైన బంగారు భరత బిడ్డడు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment