అంతా వ్యూహాత్మకం
తేది : 04-01-2023
శీర్షిక : మున్ముందుగా ....
కవిత సంఖ్య : సహస్రాధికం
మంచి చెడుల మతలబులు
పక్కన పెట్టి...చిన్నా పెద్ద సుద్దు లను
వద్దాన్నా....పకడ్బందీ వ్యూహాలుంటేనే...
పనులలో ఫలితాలు సానుకూలం ....
గగనపు మేఘాల తోరణ శిఖరాలలో
గమ్మత్తుగా గమ్యం చేరుకోవాలంటే
అంచనాల సంచులన్నీ కుమ్మరించి
వరుసగా లెక్కలన్నీ పెట్టుకోవాల్సిందే ....
కలుగులోని ఎలుకలను పట్టుకోవాలన్నా ...
కాకలు తీరిన యోధులను పడగొట్టాలన్నా ...
లక్ష్యాల చుక్కలను లెక్కలేసుకుని
పచ్చని ప్రణాళికల పందిరి వేయాలి ....
మరీ ముఖ్యంగా రంగులు మార్చే
రాజకీయ చదరంగంలో ఎత్తులెప్పుడు
ఊరుకన్నా ముందుగా ఉతికి ఆరవేయాలి ....
అందరికన్నా ముందుగా అందించాలి ....
అందుకోలేని ఎత్తులకు ఎదగాలనుకుంటే ....
ఒప్పుగ భ్రమింపజేసే తప్పులు తాత్కాలికంగా
విజయాల ముల్లెలు అందించినా ... నిప్పులు
కక్కే నిజాలు మాత్రం నిలకడగా విజయం చేర్చి
నిర్మలమైన ప్రశాంతతలతో ... నిశ్చింతల ఆత్మ
సంతృప్తుల ఆనందాలను అందింస్తుంది ....
ఆరోగ్యకరమైన సంఘజీవనాలకు దారి వేస్తుంది. ...
భారతంలో బావిలోని బంతిని తీయాలన్నా ....
కలియుగంలో పాలక కుర్చీలాటలో కర్చీఫ్
వేయాలన్న .... మున్ముందుగా ముచ్చటైన
తచ్చాటల పాదయాత్రలు పదోన్నతుల
పద నిర్దేశికాలవుతన్నాయి ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment