Monday, February 12, 2024

తలపుల తపనలు తేది: 17-02-23 శీర్షిక: తీయని శ్వాస

 తలపుల తపనలు 

తేది: 17-02-23
శీర్షిక:  తీయని శ్వాస 
కవిత సంఖ్య: సహస్రాధికం 

మనసు పొరలలో మౌనంగా 
బంధించుకున్నప్పటి నుండి 
తీపి కలవరింతలే ....మౌనంగా 
మననమే ఆలోచనల సవ్వడిలో 
ప్రతి క్షణం .... 

పనులలో లీనమై మునిగినా ... 
పయనంలో సాగినా ... అలసట 
తోటలో అలమటించినా ....నీ 
తలపులే తీయని శ్వాసలైనాయి ....  

నా తపనలన్నీ  తదాస్తులై 
ఎదురుచూపులన్నీ ఎదురొచ్చినవేళ
తలపులలో తడిచిన మొహం 
తలంబ్రాలై మురిపించాయి .... 

తొలి యాదుల గమ్మత్తులొ ... 
మలి చూపుల మాయలో ... 
బ్రతుకుబాటను బంగారంగా మార్చి 
నిత్యం చెరగని చిరు నవ్వుల 
నవరత్నాలను పూయించావు .... 

నడిచొచ్చిన కుసుమ తోటలోని 
అనుభవాలను అక్కున చేర్చుకున్న 
ప్రతీ నిమిషం .... ఆనందాల 
వెల్లువలై  ... పరిమళభరితమై 
శోభిస్తుంటాయి  ...  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment