మహాశివరాత్రి
తేది: 17-02-23
శీర్షిక: శివ శివ
శివశివ హరహర కైలాసవాసా
శంభోశంకర మహాదేవ
హరహర శివశివ సదాశివా
భక్తుల బ్రోవగ రావేరా ....
భక్తసులభుడవని భావించేరు
భక్తితో నిన్నుసదా కొలిచేరు
బోళానాథుడు నీవే కదా ...
సోమసుందరుడు నీవే కదా ....
// శివ శివ //
అవినాశుడవని కొనియాడేరు
అధినాథుడని కీర్తించేరు
గరళకంఠుడువి నీవే కదా
నిటలాక్షుడవు నీవే కదా ....
// శివ శివ //
పరమశివుడవని ప్రార్థించేరు
సోమశేఖరుడవని పూజించేరు
మహేశ్వరుడవు నీవే కదా ...
మృత్యుంజయుడవు నీవే కదా ...
// శివ శివ //
ఆది తెలియదు అంతు చిక్కదు
ఆదిభిక్షువుగ కీర్తించుదురు
అపురూపముగా కొలిచెదరు
ప్రళయకాళుడవు నీవే కదా ...
పాపవిమోచనుడవు నీవే కదా ....
// శివ శివ //
మనమున నిన్నే తలిచెదము
మననముతో తరియించెదము
మాస శివరాత్రి మహా ప్రీతిపాత్రము.
మహాశివరాత్రి గొప్ప పర్వదినము …
నగునూరి రాజన్న
No comments:
Post a Comment