కళాశ్రీ చిత్ర కవిత
తేది : 17-02-2023
శీర్షిక : అపర ఝాన్సీ
ప్రభుతలెన్ని మారినను
ఫలములేమి ? పాలకులెంత
మంది మారినను పరిణామమేది ?
ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది ...
అక్షరాస్యతలు నేడు అందుకొన లేదు
వందశాతం పొందుగాను దేశమందు
వరుసబెట్టి వత్సరములు గడుచుచున్న
వజ్రోత్సవముల జాడ వరకైనను .....
పట్టుబట్టి చదివినా ... ఐదు లేదా
పది దాటారు నేటికి పల్లెపట్టున ....
చదివినా దొరకవు తదునుగుణమున
తర్ఫీదు పొందిన ఉపాధి కల్పన ....
కడుపులు నింపుకొనవలెనన్న
కాళ్ళు చేతులాడవలెనన్నట్టుగా ....
కదిలింది స్త్రీమూర్తి కదనరంగమంటి
కార్మికలోకమునకు కట్టుకుని వీపున
చిట్టి తండ్రిని అపర ఝాన్సియై
ఆ ద్విచక్ర వాహనముపైన .....
సంసార రథ చక్రము సాఫీగా
నడవవలెనన్న ... చేదోడు వాదోడు
చేయవల్సినదే ఆడకూతురైనా ...
అంతోటి ... ఇంతోటి పని ఏదైనా ...
వేన్నీళ్ళకు చన్నీళ్ళ వలె ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment