Thursday, April 18, 2019

ఆకుపచ్చని వసంతం

ఆకుపచ్చని వసంతం 
05 -01 -2019 
శీర్షిజ: అధోగతే మానవాళి జాడలు....
సంఖ్య: 115 

జర జర జనాభా పెరగడమేనేమో
ప్రజ, పాలకుల  నిర్లక్ష్యమేనేమో
కక్షగట్టిన పాలిథీన్ల పరేశానేమో
కడకు భూమి పొరలు సైతం.....

కంటి పొరలు కమ్ముకుంటున్నాయి
అరిచి  గొంతు మూగబోతున్నది
సీసం చెవిన ప్రతిబంధకమౌతున్నది
అరణ్య రోదనగా మిగులనున్నది.......

దుర్భినికైనా దొరకని సుభిక్షం
గుక్కెడు దాహం తీరదేమో
అట్టడుగున చేరుతున్న వైనం
ఆనవాయితీగా రోదించడం......ప్రతీయేడు

రంగు నేర్చిన రాజకీయం
అహం నిండిన అధికారం
అలసత్వపు ప్రజా పైశాచికం
వెరసి మన పర్యావరణం....

ఎక్కడమ్మా  నీ అడుగుజాడలు
కొని తాగే మంచినీరే.......చిరునామా 
మంచి  శ్వాసకై నిరీక్షించి.....
రాబోయ్యే రోజుల్లో కొనుక్కోబోయే
ఆక్సీజనే ఆకుపచ్చ వసంతం.....

ఆదమరిచి  కొనసాగితే....
అధోగతే మానవాళి జాడలు....మున్ముందు...

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment