అంశం: భోగి మంటలు
తేదీ 14-01-2019
శీర్షిక : ఆరోగ్యాల ఆహ్వానం
సంఖ్య : 122
ధనుర్మాసానికి చివరి రో జై
దినకరుడు మకర రాశి ప్రవేశించ.......
దక్షిణాయనానికి ముగింపు పలికి
ఉత్తరాయణానికి ఆహ్వానమంపు ....
జిలుగు వెలుగుల పర్వం
తెలుగు నేల నలు చెరగుల
ప్రతి పాతను వదిలి
సరి కొత్తకు సంక్రమణం.
ఆరోగ్య శాస్త్రం అన్వయించినట్టు
అనారోగ్య కారక కాల ప్రభావం దాటుకుని
భోగి మంటల శుభాలకాహ్వానం
సుఖ సమయాన అడుగిడు జనం .....
పంట దిగుబడులు ఇంట నిండగ
భోగ భాగ్యములనిచ్చు భోగి పండగ
సంతసాలనిచ్చు సంక్రాంతి,కనుమ
కొత్త అల్లుళ్ళ కోరికలు దీర్చ .......
నాడు పల్లె పల్లెన వెల్లి విరిసింది
పశు, పనిముట్ల అలంకారాలతో
ధాన్య రాశులు దండిగా పొంగు
పసుపు పచ్చని పంట పొలాలతో......
నేడు ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో కనవచ్చు
రంగు రంగుల రంగవల్లుల తీర్చి
ఆడ మగ పిల్లా పాపలతో
ఆట పాటల ఆహ్వానించు ఆచార సంప్రదాయంగా.....
నగునూరి రాజన్న
తేదీ 14-01-2019
శీర్షిక : ఆరోగ్యాల ఆహ్వానం
సంఖ్య : 122
ధనుర్మాసానికి చివరి రో జై
దినకరుడు మకర రాశి ప్రవేశించ.......
దక్షిణాయనానికి ముగింపు పలికి
ఉత్తరాయణానికి ఆహ్వానమంపు ....
జిలుగు వెలుగుల పర్వం
తెలుగు నేల నలు చెరగుల
ప్రతి పాతను వదిలి
సరి కొత్తకు సంక్రమణం.
ఆరోగ్య శాస్త్రం అన్వయించినట్టు
అనారోగ్య కారక కాల ప్రభావం దాటుకుని
భోగి మంటల శుభాలకాహ్వానం
సుఖ సమయాన అడుగిడు జనం .....
పంట దిగుబడులు ఇంట నిండగ
భోగ భాగ్యములనిచ్చు భోగి పండగ
సంతసాలనిచ్చు సంక్రాంతి,కనుమ
కొత్త అల్లుళ్ళ కోరికలు దీర్చ .......
నాడు పల్లె పల్లెన వెల్లి విరిసింది
పశు, పనిముట్ల అలంకారాలతో
ధాన్య రాశులు దండిగా పొంగు
పసుపు పచ్చని పంట పొలాలతో......
నేడు ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో కనవచ్చు
రంగు రంగుల రంగవల్లుల తీర్చి
ఆడ మగ పిల్లా పాపలతో
ఆట పాటల ఆహ్వానించు ఆచార సంప్రదాయంగా.....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment