Saturday, April 27, 2019

నేటి చలన చిత్రాలు

అంశం : నేటి చలన చిత్రాలు 
తేదీ: 15 -03 -2019 
శీర్షిక : బొమ్మ బొరుసు
సంఖ్య : 150 

“చలనచిత్రం” అంటేనే చమత్కారం 
సామాన్యుడికది సరదాల చిహ్నం 
కొంతమందికి ‘కళ’ల సామ్రాజ్యం 
మరి కొంత మందికి పట్టాభిషేకం ....

అబ్బో! అదొక వింత వింత లోకం 
ఆనందాల, బాధల నిలయం 
ఆటగాళ్లకు, పాటగాళ్లకు, వ్రాతగాళ్లకు కేంద్రం
సా0కేతికులకు సమున్నత స్వప్నం 

తెర చిన్నదైనా, పెద్దదైనా 
తరగని వినోదాల తలపుల గని 
తండ్లాటాలు, పొర్లు దండాలు ఒక్క చాన్సుకై...
సెంటిమెంట్లకు, సెటిల్ మెంట్లకు తావు .... 

వినోదాలు మాత్రమే కాదు మిత్రమా 
విజ్ఞానపు మైలు రాళ్లకు విడిది ....
ఆడియోలు, వీడియోలంటూ .... 
అచ్చెరువుగా అదరగొడుతుంది .... 

చారిత్రిక కళా ఖండాలకు 
చమత్కార సాంఘికాలకు 
చలువ కుటుంబ కథలకే కాదు
చండ ప్రచండ పౌరాణికాలకు కేంద్రం... 

మంచి చెడులు జోడు గుర్రాలైనట్టు 
కష్ట సుఖాలు కావడికుండలోలె 
సుఖదుఃఖాలు బొమ్మ బొరుసు లెక్క 
చలనచిత్ర రంగం కూడా అతీతమేమి కాదు సోదరా.... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment