Thursday, April 18, 2019

అయితే నాకేంటి

అంశం : అయితే నాకేంటి
తేదీ : 23-01-2019
శీర్షిక : "మనీ" షి
సంఖ్య :128

మనిషి   "మనీ" షి గా  మారి 
ఇంటా , బయట  బంధం మెరుగక 
తెగిన గాలి పటమై 
తీరం లేని సంద్రములో 
కొట్టు మిట్టాడుతున్నడు . 

తోటి వాడికి తోచిన సాయం 
చేయాలన్నా ......... 
జీతం తీసుకుని బాధ్యత గా 
చేయాల్సిన పనికి సైతం....  
నిస్సిగ్గుగా చేతులు చాపుతూ ... 
కోట్లకు కోట్లకు స్వాహాలు చేస్తూ......  
చిన్న మొత్తాలకు ఆశపడి 
పెద్ద మొత్తాలు సరిహద్దులు  దాటేందుకు 
పరోక్ష సహకారాలందిస్తున్నారు 

పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కాదు 
పెళ్లి అయితే కానీ  పిచ్చి కుదురదు ....  లాగ 

మంచి పాలకుడొస్తే గాని 
అందరికీ విద్య వైద్యమందదు.  
అందరికి విద్య వైద్యమందితేనే గాని,  
ఆలోచన శక్తితో  ఆరోగ్యమైన సంఘం ఏర్పడదు .... 

స్వర్ణ జయంతుల సంబరాలు 
కర్ణ పేయముగా జరుపుకుంటే 
కదలి రాదు కలియుగాన 
కల్మషము లేని పాలన .......  

వజ్రాయుధాల ఇంద్రుళ్లంతా 
వక్రబుద్ధుల వంతలు మాని 
పదునైన ఓటు పనిముట్టును వాడితేనే...కదా!
ప్రశ్నించే గుండె ధైర్యాన్ని 
గూడు కట్టుకుని ప్రోది చేసుకుని
సద్బుద్ధుల సరంగులను ఎన్నుకుంటేనే ... కదా! 

యథారాజ తథా ప్రజ 
రాజ్యం  సుభిక్షమైతేనే కదా
అధికారుల అర్రులు అరికట్టి 
ప్రజా సంక్షేమం  పాదు గొల్పేది....  
ముందుతరాలకు ముదము గూర్చు.....


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment