Thursday, April 18, 2019

ఎదుటివారికి చెప్పేటందుకే

అంశం : ఎదుటివారికి చెప్పేటందుకే 
తేదీ : 25-01-2019
శీర్షిక : నాతో  సహా ..... 
సంఖ్య : 130

అవొచ్చేమో తక్కువా, ఎక్కువా
అందరి ఆలోచనా విధానం
అదే మూస పద్దతి... 

ఒకరు వ్యక్తిగతం కావొచ్చు .... 
ఒకరు సంఘ పరంగా  కావొచ్చు..... 
మరొకరు దేశ పరంగా  కావొచ్చు..... 

తాను చదవని చదవలేని విద్యలు 
తన పిల్లలచే  చదవించాలని .... 
తాహతులు అర్హతలు  తరిచి చూడక 
తప్పక చదవాలని పట్టు బట్టే...... 

పొద్దున్న లేచింది మొదలు
సంఘములో సడేమియాల్లాంటి  
రాజకీయాలు, లంచగొండి తనం 
అందరూ వల్లే వేసే సొల్లు కబుర్లే .... 

తన దాకా వచ్చే వరకు మాత్రం 
తీసుకోకుండా పని చెయ్యమంటే 
ఏడ్చేస్తాడు .... 
ఇవ్వకుండా ఓపిగ్గా రెండు మూడు 
సార్లు తిరిగి పని చేసుకోవాలంటే... 
మనకి ఏడుపొస్తది..... 

అర్హతలుండి ప్రజాసేవకు  
అందిపుచ్చుకోరు కొందరు.... 
ఆడిపోసుకోడానికి మాత్రం 
అందరికంటే ముందు వరుస ......... 

వాళ్ళ హయాములో జరిగిన 
విషయాలు వీళ్ళు...... 
వీళ్ళ హయాములో జరిగిన విషయాల 
మీద వాళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం..... 

బయట దేశం బాగుంది.... 
మన దేశం ఎప్పుడు బాగు పడుతుందో... 
ప్రతివారు బాధ పడటమే గాని ..... 

మనము మాత్రం వీసమెత్తు మారం.
నాతో  సహా ..... 

సలహాలిచ్చుకుంటూ పోతే ....... 
చెప్పడమే కాదు ఆచరించాలి 
ఆచరణ యోగ్య సలహాలు   ..... 
ఆదరణకు ఆమోదమగును  .... 
 
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment