Thursday, April 18, 2019

వీడ్కోలు

అంశం : వీడ్కోలు 
తేదీ 31 - 12 -2018 
శీర్షిక : యుగధర్మం 
సంఖ్య : 113  

కకావికలమౌతున్న కట్టుబాట్లను 
కట్టు దిట్టముగా కాపాడుకుందాం. 
పచ్చని ప్రకృతిలో చిచ్చు రేపుతున్న 
కాలుష్యానికి కట్టలు వేద్దాం! 

పరి పరి విధాలా పగులు చూపిస్తున్న 
అతి నీల లోహిత కిరణ నిరోధక పరదా.....  
అందుకు ప్రేరేపితమైయ్యే 
ఇంధన వినియోగాలకు కట్టలు వేద్దాం !

ముత్యపు చిప్పలనిచ్చే స్వచపు నీటి తావులను
మానవ కృత్యాలతో  మలినాలర్పిస్తూ  
నిత్యం కాలుష్యాల కాసారాలుగ మార్చకుండా 
అచ్చమైన కృషి చేసి ఆపేద్దాం !

పెరుగుతున్న ఘోర కలి కాలుష్యాలను 
నిమ్మకు నీరెత్తినట్టున్న ప్రభుత్వాలు పట్టించుకోపోతే 
జరుగుతున్న చరిత్రే..  చర్విత చరణం  
యుగధర్మమే జీవకోటికి  వీడ్కోలు పలకదా .... 

నగునూరి రాజన్న 







No comments:

Post a Comment