Thursday, April 18, 2019

దేశ ముదుర్లు

నగునూరి రాజన్న
అంశము : దేశ ముదుర్లు 
తేదీ 08-01-2019
శీర్షిక : గంజిబ్రదర్స్ 
సంఖ్య  : 117 

అబ్బో ... అబ్బో ..... 
ఆ డాబు దర్పం .... 
రెండు కళ్ళు చాలవంట నమ్ము !

మడత నలగని చొక్కాలు 
మడత పేచీల ఘనకార్యాలు 
ఉసురు తీసే వంకీల జుట్టు 
చేతినిండా ఉంగరాలు 
బ్రతుకులార్పే బ్రాస్లెట్లు 
పడవంత కారు 
పలుకరించాలంటే 
ఓ పర్సనల్  సెగెట్రీ ........ 

అందమైన అబద్దాన్ని 
అచ్చు గుద్ది చెప్పగలరు 
అరవిరిసిన మాటలతో 
అవుననిపించగలరు. 
ఊగిసలాడామా .... 
ఉనికి లేకుండా చేయగలరు
అధిక వడ్డీల ఆశలు చూపి 
అసలుకే ఎసరు పెట్టగలరు . 
చీటీలని,పాలసీలని 
చిన్న మొత్తాలను కబళించగలరు 
కష్టజీవుల జేబులు 
కత్తిరించే కసాయిలు 
కలి మాయ కమ్మిన జలగలు. 
తర తమ భేదమెరుగని 
(క )తంత్రీ పాలకులు 
రాజకీయ కనుసన్నల్లో 
కాఖీల కబంద హస్తాల్లో 
చట్టాల చుట్టరికం చూపి 
సంపద సరిహద్దలు దాటిస్తారు . 
మాయల మరాఠీ మాఫియాను 
మైమరిపిస్తారు. 

తస్మాత్ జాగ్రత్త........ 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment