అంశం : ముద్దబంతి పూలు
తేదీ: 08 -01 -2019
శీర్షిక : ముద్దబంతి స్వగతం
No 118
రంగులు రువ్వే పువ్వులం
రంజింప జేయు కుసుమాలం
రాజు పేద బేధములెఱుఁగం
రమ్మని ఎల్లరిని ఆహ్వానించెదం
ఓనమైనా బోనమైనా
ముందువరుసలో మేముంటాము
బతుకమ్మైనా బతుకు గమనమైనా
అచ్చటా ముచ్చటా మాతోనే
మా గుండెల్లో మీరు సూది గుచ్చినా
గుడి గుమ్మాల దగ్గరే మమ్ము నిలువరించినా
బుడి బుడి అడుగుల సొగసులు పంచుతాము
వడివడి నడకల ఆనందాలు వెదజల్లుతాము
ముందొచ్చిన ఆకులకంటే అందర్నీ
వెనకొచ్చిన మేమె పలుకరిస్తాం
మకరందపు కుసుమ మాలాలెన్నున్నా
మాతోనే నిండు శోభ నమ్మండి......
సున్నితపు సుతారాలు మేమైనా
సూదులతో నిలువెల్లా గాయపర్చినా
సుందరతను పెంపొందిస్తాము
శుభకార్యాల సందళ్ళలో........
పెళ్లిళ్లు పేరంటాలు
పూజలు పుణ్యాలు
ఉత్సవాలు ఊరేగింపులు
పండగలు పబ్బాలు
గొబ్బెమ్మలకు గోపూజలకు......
రాజకీయం వాణిజ్యం
అధికారిక, అనధికారిక .....
అది ఇది అను తేడా లేదు
అన్నింటా మాకే తోలి వాయనం...... సుమండి......
నగునూరి రాజన్న
తేదీ: 08 -01 -2019
శీర్షిక : ముద్దబంతి స్వగతం
No 118
రంగులు రువ్వే పువ్వులం
రంజింప జేయు కుసుమాలం
రాజు పేద బేధములెఱుఁగం
రమ్మని ఎల్లరిని ఆహ్వానించెదం
ఓనమైనా బోనమైనా
ముందువరుసలో మేముంటాము
బతుకమ్మైనా బతుకు గమనమైనా
అచ్చటా ముచ్చటా మాతోనే
మా గుండెల్లో మీరు సూది గుచ్చినా
గుడి గుమ్మాల దగ్గరే మమ్ము నిలువరించినా
బుడి బుడి అడుగుల సొగసులు పంచుతాము
వడివడి నడకల ఆనందాలు వెదజల్లుతాము
ముందొచ్చిన ఆకులకంటే అందర్నీ
వెనకొచ్చిన మేమె పలుకరిస్తాం
మకరందపు కుసుమ మాలాలెన్నున్నా
మాతోనే నిండు శోభ నమ్మండి......
సున్నితపు సుతారాలు మేమైనా
సూదులతో నిలువెల్లా గాయపర్చినా
సుందరతను పెంపొందిస్తాము
శుభకార్యాల సందళ్ళలో........
పెళ్లిళ్లు పేరంటాలు
పూజలు పుణ్యాలు
ఉత్సవాలు ఊరేగింపులు
పండగలు పబ్బాలు
గొబ్బెమ్మలకు గోపూజలకు......
రాజకీయం వాణిజ్యం
అధికారిక, అనధికారిక .....
అది ఇది అను తేడా లేదు
అన్నింటా మాకే తోలి వాయనం...... సుమండి......
నగునూరి రాజన్న
No comments:
Post a Comment