అంశం: స్మారక చిహ్నాలు
తేదీ 29 -01 -2019
సంఖ్య: 133
యుగ యుగాలు మారినా
జగాన అచ్ఛమై నిలిచేది
మంచి చెడుల చిరునామాలే
మానవత్వపు పరిమళాలే.
దేశం ప్రాంతం ఏదైనా
రాజు పేద బేధం లేక
మేను పోషణకు అంగాలవలె
పదిమంది క్షేమం పదిలపరిస్తే...
మంచి కోరిన వారి మననం
మరల కోరు మానవత్వం
మార్పు చెందు మనిషి హృదయం
పాదుకొల్పు కమల కుసుమమై...
రూపం చిత్రం చిహ్నం ఏదైనా
ప్రత్యామ్నాయం పరిచయానికి
ముందుతరాలకు ముదితమివ్వ
అందించే ఆరాటం ....
అందరు బాగుండాలి
అందున నేనుండాలి
ముందుతరం సైతం
ముదములు నిండాలి.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment