Thursday, April 18, 2019

సందుగ

అంశం : సందుగ
తేదీ : 07 - 02 - 2019 
శీర్షిక : తరాల వారధి 
సంఖ్య : 140 

ఆనవాయితీగా 
అందరమ్మాయిలకు 
అమ్మా నాన్నలిచ్చే ప్రేమ 
ఆత్మీయతల పొట్లామ్.....

రాజు పేద బేధమెరుగని
రంగు రంగుల పంజరం 
రమణీయతల పాదుకొల్పే 
రవ్వల మెరుపుల త్రిజోడి ....

తాతయ్య చెమటకు చిరునామా  
నాయనమ్మ పొదుపుకు ప్రతిరూపం
ఇంటిల్లిపాదికి ఇష్టమయ్యే 
అష్టలక్ష్ముల కామధేనువు.... 

వేల ఎకరాల దస్తావేజులకైనా 
వెలకట్టలేని నగ  నట్రకైనా
విజ్ఞానాలు పెంచె పొత్తాలకైనా
వినోదాలు పంచె బొమ్మలకైనా 
నానమ్మ చేతిలో మాయల పెట్టె.....

మంచి చెడుల ముచ్చట్లకు 
మరువలేని ఊసులకు
తరతరాల తీపి గుర్తుల్ని 
తనివిదీరా పెనవేసుకున్న వారధి

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment