అంశం: పొద్దు తిరుగుడు పూలు
తేదీ : 26 -03 -2019
శీర్షిక : సాక్ష్యాల బోధనలు ...
సంఖ్య : 152
ప్రకృతి కాంత సిగలో
పరుచుకున్న పసిడి వన్నెల హొయలతో
ప్రతి కుసుమాన పడతి కుంకుమ బొట్టందంతో
పరవశించు ప్రతి హృదయం కాంచినంతనే...
కలి మాయన రవితో భువి గమనం
కనిపెట్టలేని చందంగా ......
కదం కలిపి ప్రకృతి సిద్ధంగా దిశను మార్చుకున్నా
కావాలి ప్రతి అడుగు ప్రగతి శీలమని బోధిస్తుంది...
కాయ కష్టం చేసిన నాటి కార్మికులు
కర్ర చక్రాల నమ్ముకున్న చేతివృత్తుల
కమ్మరి కుమ్మరి కంసాలి నేతన్నలు .....
కాలం చెల్లిన పొద్దు తిరుగుడు పూలే....
కదనరంగపు వీర సైనికుల్లా ....
కుటుంబ, ఉద్యోగ బాధ్యతలతో
కాసింతైనా సేద దొరకక సతమతమౌతూ
కావడి కుండైన నేటి ఉద్యోగ కాంతామణులు....
కాలపు పరుగు పందెంలో పొద్దుతిరుగుడుపూలే.....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment