Thursday, April 18, 2019

కలిసి నడుద్దాం

అంశం: కలిసి నడుద్దాం 
తేదీ: 13 -02 -2019 
శీర్షిక గెలిచి నిలుద్దాం 
సంఖ్య : 143 

అమ్మ నాన్నల ఆత్మీయతలు 
తోబుట్టువుల అనురాగాలు 
బంధు మిత్రుల బంధనాలు 
ఆర్ధిక బంధాలై అటకెక్కుతున్నాయి 

నవ నాగరికత నడకలో...
యువ పాశ్చాత్య పోకడలో ....
అహం బ్రహ్మాస్మి బతుకులో .... 
సాంకేతికత సవాళ్ల సొబగులో....

చరిత్ర పుటల్లో  నిలిచిన
చర్విత చరణాలుగా మిగిలిన
గర్వకారణమైన ప్రేమాప్యాయతలు 
మన దేశ సాంప్రదాయపు ఆనవాళ్లు... 

అనాది నుండి పరికిస్తే 
ఆలనలకైనా పాలనలకైనా 
కలిసి నిలిచిన మానవుడు 
కథా సాగరుడే మిత్రమా!

కుటుంబమైనా సంఘమైనా
కలిసి నడిస్తినే పథం చేరేది 
దేశమైన విశ్వమైనా 
కలిసి నడిస్తేనే ప్రగతి సాధించేది.... 
విశ్వపు అంచుల్లో గెలిచి నిలిచేది .... 

నగునూరి రాజన్న

No comments:

Post a Comment