Thursday, April 18, 2019

ప్రతిభకు పట్టాభిషేకం

అంశం : ప్రతిభకు పట్టాభిషేకం 
28 -01 -2019 
శీర్షిక :స్థితప్రజ్ఞతకు పట్టం
సంఖ్య: 132 

పర తమ బేధాలు పక్కన పెట్టు 
కులమతాల పిచ్చి చిచ్చుపెట్టు 
అర్హతలు ప్రావీణ్యత ఒడిసిపట్టు  
అన్నీ ఉన్నవారికే కట్టబెట్టు 

జాతి వివక్ష పనిపట్టు
జనాదరణ పసిగట్టు 
జననాయకుణ్ణి నిలబెట్టు 
జగతి గగనాన ఎగిరేట్టు

కార్మికుడైనా కర్షకుడైనా 
క్రమశిక్షణల సైనికుడైనా 
సమున్నత దేశ  ప్రగతి 
సంస్మరణ మంత్రం కావాలి 

ప్రతిభ వలసలు నిరోదిద్దాం
జాతి జవసత్వాలు నిలబెడుదాం
సత్పలితాలు రాబడుదాం
విశ్వ విజేతగా గెలిచేద్దాం

ప్రజలంటే ప్రాణం పెట్టే
దేశమంటే పిచ్చి ప్రేమను చూపెట్టే 
పొరుగును చూసి ప్రేమించే 
చెడును ద్వేషించే
మంచిని గుర్తించి 
మమతకు కట్టుబడే 
అవసరాన ధైర్యం ప్రదర్శించే 
సమస్త సద్గుణాల 
స్థితప్రజ్ఞతకు పట్టం కట్టు....


నగునూరి రాజన్న

No comments:

Post a Comment