Thursday, April 18, 2019

ఒకే ఒక్కడు

అంశం : ఒకే ఒక్కడు
తేదీ : 18-01-2019
శీర్షిక : మచ్చ లేని చంద్రుడు 
సంఖ్య  : 126

బాల్యములో భ్రమించినా 
స్వీయ నియంత్రణలు 
స్వయం ఆచరణలనే 
ఆదర్శించిన  ఘనాపాటి. 

అత్యున్నత చదువులుండి 
నల్ల జాతివాడంటూ 
ఆఫ్రికా ఖండాన 
ఆకతాయిగా గెమ్మెటివేయబడ్డాడు. 

స్వదేశాన్ని సందర్శించి 
పట్టుదల దీక్షలకు ప్రతిరూపమై  
పరితపించి పరిశ్రమించాడు 
ప్రతివారిని  పులకింపజేసాడు 

పరమత సహనం పాటించాడు 
లౌకికవాదమే లోక సుభిక్షమన్నాడు 
ఆసేతు హిమాచలం అఖండ భారతం 
సత్యం, అహింస కలిపిన సత్యాగ్రహాన్ని పాదుగొల్పాడు. 

మూడు శతాబ్దాల దాస్యానికి 
ముచ్చటగా చరమ  గీతం చెప్పించాడు 
మువ్వన్నెల జండా ఎగుర వేయించి 
ముమ్మూర్తులా జాతి పితగా కీర్తించబడ్డాడు. 

విశ్వ వీధి గగనాన  విశ్వవిద్యాలయాల్లో 
వ్యక్తిత్వ వికాసానికి ఉదహరణై నిలిచాడు
ఒకే ఒక్కడు  విశ్వజ్యోతి అయ్యాడు 
ఆతడే మన కరం చంద్ గాధీజీ 

నగునూరి రాజన్న 



No comments:

Post a Comment