అంశం : అంతరాత్మ
తేదీ 17 -01 -2019
శీర్షిక : పరమాత్మ అంశ
సంఖ్య: 125
అనేక సంవత్సరాల అనుభవాలు
అధికారులు అనధికారులు
అతలాకుతలం అవుతూనే ఉంటారు
ఊహల పల్లకిలో ఊరేగిస్తుంది
సగటు మనిషికి సందివ్వదు
నిపుణులకు సైతం నిక్కచ్చినివ్వదు
లేని నల్ల పిల్లిని చీకటి గదిలో
పట్టుకొవాలనే అత్యాశ......
అంత రమారమే సుమండీ....
అలాంటిది మాత్రం కాదండోయి.....
అడుగడుగున అనుసరిస్తుంది
అనుక్షణం అప్రమత్తం చేస్తుంది
మనసుకు మనిషికి మధ్యవర్తిత్వం నెరుపుతుంది
బుద్ది మారి చద్దన్నం కాజేద్దామనుకుంటే
హద్దులేర్పరిచి సుద్దులు చెబుతుంది
పర తమ బేధం చూపదు
ఎదుటివారిని ఎండగడుదామనుకున్నప్పుడు
ఎదురు నిలిచి ప్రశ్నిస్తుంది
మనల్ని ఎవరైనా కీర్తిస్తుంటే
మన తప్పొప్పులను మననం చేస్తుంది
అది గమనించు వారందరిని
రక్షణ కవచమై పహారా కాస్తుంది .....
అందరిని ఆవరించి ఉంటుంది.
నిక్కచ్చిగా పాటించిన వారిని
నింగిన నిలిపినది............
అందుకు చరిత్రలే సాక్ష్యం...
అదే పరమాత్మ అంశ
మనందరిలో నిలిచినా ఆత్మ సాక్షి ....
నగునూరి రాజన్న
తేదీ 17 -01 -2019
శీర్షిక : పరమాత్మ అంశ
సంఖ్య: 125
అనేక సంవత్సరాల అనుభవాలు
అధికారులు అనధికారులు
అతలాకుతలం అవుతూనే ఉంటారు
ఊహల పల్లకిలో ఊరేగిస్తుంది
సగటు మనిషికి సందివ్వదు
నిపుణులకు సైతం నిక్కచ్చినివ్వదు
లేని నల్ల పిల్లిని చీకటి గదిలో
పట్టుకొవాలనే అత్యాశ......
అంత రమారమే సుమండీ....
అలాంటిది మాత్రం కాదండోయి.....
అడుగడుగున అనుసరిస్తుంది
అనుక్షణం అప్రమత్తం చేస్తుంది
మనసుకు మనిషికి మధ్యవర్తిత్వం నెరుపుతుంది
బుద్ది మారి చద్దన్నం కాజేద్దామనుకుంటే
హద్దులేర్పరిచి సుద్దులు చెబుతుంది
పర తమ బేధం చూపదు
ఎదుటివారిని ఎండగడుదామనుకున్నప్పుడు
ఎదురు నిలిచి ప్రశ్నిస్తుంది
మనల్ని ఎవరైనా కీర్తిస్తుంటే
మన తప్పొప్పులను మననం చేస్తుంది
అది గమనించు వారందరిని
రక్షణ కవచమై పహారా కాస్తుంది .....
అందరిని ఆవరించి ఉంటుంది.
నిక్కచ్చిగా పాటించిన వారిని
నింగిన నిలిపినది............
అందుకు చరిత్రలే సాక్ష్యం...
అదే పరమాత్మ అంశ
మనందరిలో నిలిచినా ఆత్మ సాక్షి ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment